
వరల్డ్ మెగా మారథాన్ పూర్తిచేసిన కల్యాణ్
బీచ్‌రోడ్డు: ఇండియన్ స్కేటింగ్ మాజీ కోచ్, జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించిన కూరపాటి కల్యాణ్(54) జర్మనీలోని బెల్జియం నగరంలో జరిగిన వరల్డ్ మెగా మారథాన్‌లో పాల్గొని, పతకం సాధించారు. రాష్ట్రం తరఫున ఎంపికై న ఆయన ఈ నెల 20న జరిగిన ఇన్‌లైన్ స్పీడ్‌లో 42 కిలోమీటర్లు, 21న 42 కిలోమీటర్ల మారథాన్ పరుగు సకాలంలో పూర్తిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా 181 దేశాల నుంచి 80 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 8 వేల మంది విజేతలుగా నిలిచారు. విశాఖ వుడాపార్క్‌లో కోచ్‌గా ఉంటూ వేలాది మందిని స్కేటింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. కల్యాణ్ రోలర్ స్పోర్ట్స్ అకాడమీ స్థాపకులు. విశాఖ డిస్ట్రిక్ట్ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌చంద్ర, ఉపాధ్యక్షుడు కరణం గంగాధర్, జాయింట్ సెక్రటరీ రాజ్‌కుమార్, కోచ్‌లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు.