
అప్రెంటిస్ నియామక పత్రాల అందజేత
డాబాగార్డెన్స్: 2025–26 సంవత్సరానికి సంబంధించి డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) ట్రేడుల్లో ఉత్తీర్ణులైన ఐటీఐ అభ్యర్థులకు ఏపీఎస్ ఆర్టీసీ విశాఖ జిల్లాకు చెందిన వివిధ డిపోలలో అప్రెంటిస్ నియామక పత్రాలను జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికై న ప్రతి అభ్యర్థి అంకితభావంతో, నిబంధనలకు అనుగుణంగా తమ విధులు నిర్వర్తించాలని కోరారు. అప్రెంటిస్‌లకు నెలకు రూ7 వేలు స్టైఫండ్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ జె. తిరుపతి, అసిస్టెంట్ మేనేజర్ జి. శ్రీధర్ పాల్గొన్నారు.