
ఏపీఈపీడీసీఎల్‌లో స్వచ్ఛాంధ్ర
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీవో) కింజరాపు వెంకట రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం సర్కిల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విశాఖ సర్కిల్ ఎస్‌ఈ జి.శ్యాంబాబు, విజిలెన్స్–ఏపీటీఎస్ సీఐ ఇ.వెంకునాయుడు, జోన్–1 డీఈ పోలాకి శ్రీనివాసరావు, డీఈ టెక్నికల్ ఎం.ధర్మరాజుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం విజిలెన్స్–ఏపీటీఎస్ విశాఖ పోలీస్ స్టేషన్లను సీవీవో రామకృష్ణ ప్రసాద్ పరిశీలించారు. అక్కడ రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.