
రేపు జీఎస్టీ సంస్కరణలపై ఉత్సవాలు
బీచ్‌రోడ్డు: జీఎస్టీ సంస్కరణలపై ఈనెల 22న జీఎస్టీ 2.0 పేరిట ఉత్సవాలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. శనివారం నగరంలోని ఒక హోటల్‌లో జీఎస్టీ సంస్కరణలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అన్ని వర్గాల ప్రజల కు లబ్ధి చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసు కొచ్చిన ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దసరా కానుకగా జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చి గొప్ప బహుమతి ప్రకటించారని ఆనందం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంస్కరణలను అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలియజేశాయన్నారు. పన్నుల భారం తగ్గడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, పార్టీ అధికార ప్రతినిధులు సుహాసిని, నాయకులు పాల్గొన్నారు.