
రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సదుపాయాల పరిశీలన
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వే స్టేషన్‌ను వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా శనివారం సందర్శించారు. పండగల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, తాగునీటి సదుపాయం, ప్లాట్‌ఫారాల పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే వెయిటింగ్ హాళ్లు, ఏసీ లాంజ్‌లు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ ప్రాంతాలు, బుకింగ్ కౌంటర్లను పరిశీలించి, రైల్వే మార్గదర్శకాల ప్రకారం విధులు జరుగుతున్నాయా లేదా అని నిర్ధారించుకున్నారు. ఈ పర్యటనలో డీఆర్‌ఎంతో పాటు కమర్షియల్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆపరేషన్స్, సెక్యూరిటీ, సిగ్నల్ అండ్ టెలికం విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.