
రెయిలింగ్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఆరిలోవ: జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలివి.. ఉదయం సుమారు 7 గంటల సమయంలో విశాఖ నుంచి పార్వతీపురం వెలుతున్న ఆర్టీసీ బస్ జాతీరహదారిపై జంతు పునరావాస కేంద్రం (ఏఆర్‌సీ) సమీపంలో అదుపుతప్పింది. దీంతో ఆ బస్ రోడ్డు పక్కన రెయిలింగ్‌పైకి దూకుపోయింది. సుమారు 50 మీటర్లు వరకు రెయిలింగ్ మీద నుంచి ముందుకు దూసుకుపోయి ఆగింది. దీంతో బస్సులో ఉన్న కొద్ది పాటి ప్రయాణికులు ఆందోళనకు గురై కేకలు వేశారు. అటుగా వెళ్లే వాహనచోదకులు బస్సులో ఉన్నవారిని సురక్షితంగా కిందకు దించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు.