
ముగిసిన జిల్లా స్థాయి నృత్య పోటీలు
మద్దిలపాలెం: ఎంఎంటీసీ కాలనీలోని ఏపీఎస్‌ఈబీ వెల్ఫేర్ అసోసియేషన్ హాలులో రెండు రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి నృత్య పోటీలు ఆదివారం ముగిశాయి. భారతీయ శాసీ్త్రయ, సంస్కృతి, సంప్రదాయ, జానపద నృత్యాలతో దాదాపు 300 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. ఈ పోటీలను స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించాయి. విజేతలుగా నిలిచిన కళాకారులకు వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్టీ కమల్ బేడి, ఏపీఎస్‌ఈబీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కె.రామారావు, బ్రహ్మకుమారి రామేశ్వరి బహుమతులు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్.నాగరాజు పట్నాయక్, డాక్టర్ విజయవేణి వ్యవహరించారు.