
సింహగిరిపై నేడు శ్రీకృష్ణ జయంతి
సింహాచలం : సింహగిరిపై సోమవారం శ్రీకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6గంటల నుంచి ఆరాధన, దేవకీ అమ్మవారికి బేడామండపంలో తిరువీధి, శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టం, బాల కృష్ణుడికి బేడా తిరువీధి, ఆస్థానమండపంలో అప్పన్న ఉత్సమూర్తుల చెంతన బాలకృష్ణుడికి విశేష పూజలు, భాగవత పురాణం, శ్రీకృష్ణ ఆవిర్భా విన్నపం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం 6గంటల వరకే దర్శనాలు లభిస్తాయని స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. అలాగే మధ్యాహ్నం 11.30 నుంచి 12.15 కూడా సమయంలో కూడా దర్శనాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే మంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాజగోపురం వద్ద ఉట్ల సంబరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.