
గిరిజనుల ఆశాజ్యోతి
దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు అండగా నిలిచారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా వేలాది గిరిజన కుటుంబాలకు వారు సాగు చేసుకుంటున్న భూములపై హక్కు పత్రాలు అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఏజెన్సీలో కాఫీ సాగును ప్రోత్సహించడానికి రూ.144 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా వేలాది మంది గిరిజనులకు స్థిరమైన ఉపాధి లభించింది. ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా విశాఖ ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు వైఎస్సార్.