
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జేసీ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఇతర అధికారులతో కలిసి సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నోవాటెల్‌లో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయిన బుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ముందుగా చెక్ చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు.