
వైఎస్సార్ సేవలను స్మరించుకుందాం
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంతో పాటు నియోజకవర్గ, వార్డులోని పార్టీ కార్యాలయాల్లో ఆయనకు ఘన నివాళులర్పించాలన్నారు. అలాగే వైఎస్సార్ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రక్తదానం, అన్నసమారాధన, పండ్లు, రొట్టెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి, విశాఖ నగరానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుందామన్నారు.