
మూడు నెలలు దాటినా స్పందన లేదు
గొట్టిపెల్లి గ్రామంలో సర్వే నంబరు 64–5లో నా భార్య కమల పేరు మీద ఉన్న 50 సెంట్ల భూమి అడంగల్‌లో వేరొకరి పేరు మీద తప్పుగా నమోదైంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో తమ పేరు నమోదు చేయమని కోరగా, వీఆర్‌వో తిప్పిస్తున్నాడు. రీసర్వే సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, చుట్టుపక్కల రైతులను విచారించి, ఈ భూమి కమల పేరు మీద నమోదు చేయాలని సూచించినప్పటికీ, అప్పటి వీఆర్‌వో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. మార్చి నెలలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, అది ఆనందపురం తహసీల్దార్‌కు రిఫర్ చేశారు. ఇప్పటివరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదు. తమ వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించినా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలి.
–రౌతు అప్పలరాజు, గొట్టిపల్లి, ఆనందపురం