
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 349 వినతులు
బీచ్‌రోడ్డు : కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 349 వినతులు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు 111, జీవీఎంసీకి 54, పోలీసు విభాగానికి 15, ఇతర విభాగాలకు 169 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్‌లు ఈ వినతులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడిన కలెక్టర్.. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని, ఆన్‌లైన్ లాగిన్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా లాగిన్ చూడని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఆర్వోకు సూచించారు. టిడ్కో గృహ లబ్ధిదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అలాగే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని హెచ్చరించారు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.