
స్పా సెంటర్లపై దాడులు
బీచ్‌రోడ్డు: నగరంలో స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రామాటాకీస్ నుంచి సిరిపురం వెళ్లే దారిలోని మినీ థాయ్ స్పా సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశానికి చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ భరత్ తన సిబ్బందితో గురువారం రాత్రి దాడులు చేపట్టారు. ఈ దాడిలో ముగ్గురు ఉత్తరాది యువతులతో పాటు విశాఖకు చెందిన మరో ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న నిర్వాహకుడు రాజేష్‌తో పాటు ఒక విటుడిని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ స్పా సెంటర్ యజమాని విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. యజమానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ భాస్కరరావు తెలిపారు. విశాఖలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ భరత్ కోరారు.
ద్వారకానగర్‌లో..
తాటిచెట్లపాలెం: ద్వారకానగర్‌లోని లావిష్ స్పా సెంటర్‌పై శుక్రవారం ద్వారకా పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక్కడ అనధికారికంగా క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు జరిగాయి. స్పా నిర్వాహకుడైన కిశోర్‌తో పాటు నలుగురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువతుల్లో ఇద్దరుపశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరున్నారు. ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.