
625 మందికి రూ.39.80 లక్షల ప్రోత్సాహకాలు
బీచ్‌రోడ్డు: ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం నగదు బహుమతులను ప్రదా నం చేశారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన ఈ కార్యక్రమంలో యూపీఎస్సీ పూర్వ సభ్యుడు, విశ్రాంత ప్రొఫెసర్ కె.ఎస్.చలం విద్యా ర్థులకు బహుమతులను అందజేశారు. పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్, ఏఐఈఈఈ, జేఈఈ, మెడిసన్‌లో ప్రతిభ కనబరచిన బ్యాంక్ సభ్యుల పిల్లలకు ఏటా నగదు బహుమతులు అందజేయడం అభినందనీయమన్నా రు. కాగా.. 2024–2025 విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన 625 మంది విద్యార్థులకు మొత్తం రూ.39.80 లక్షల విలువైన నగదు బహుమతులను బ్యాంక్ ప్రకటించింది. ఇందులో భాగంగా నగర పరిధిలోని శాఖలకు సంబంధించిన 250 మందికి రూ.15.95 లక్షల బహుమతులు అందజేశారు. కార్యక్ర మంలో జోన్–1 ఆర్జేడీ బి.విజయ భాస్కర్, బ్యాంక్ గౌరవ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, డైరెక్టర్లు, బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.బి.వరలక్ష్మి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం.వి.గణేష్ కుమా ర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.