
జీవీఎంసీ పార్కుల వివరాలు తెలపండి
నగర మేయన్ పీలా శ్రీనివాసరావు
అల్లిపురం: జీవీఎంసీ పార్కుల వివరాలు తెలియజేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో పట్టణ ప్రణాళిక అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జోన్లలో ఎన్ని పార్కులు, ఖాళీ స్థలాలు ఉన్నాయో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎన్ని పార్కులు ఆక్రమణకు గురయ్యాయో, ఎన్ని పార్కులు కోర్టు కేసుల్లో ఉన్నాయో పూర్తి వివరాలు మూడు రోజుల్లో అందించాలన్నారు. అన్యాక్రాంతంలో ఉన్న పార్కులు, ఖాళీ స్థలాల వివరాలు తనకు తెలుసునని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక అందించాలని పట్టణ ప్రణాళికా విభాగాధిపతులను కోరారు. సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు, డీసీఆర్ ఎస్ శ్రీనివాసరావు, సిటీ ప్లానరు మీనాకుమారి, ధనుంజయరెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాస్, రామ్మోహన్, జీవీఎంసీ రెవెన్యూ ఆఫీసర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు తదితరులు పాల్గొన్నారు.