
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది
బీచ్‌రోడ్డు: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని.. చివరికి జిల్లా ప్రథమ మహిళకు కూడా రక్షణ కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి ఆయన క్షీరాభిషేకం చేశారు. పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో కె.కె.రాజు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు గానీ, ప్రతిపక్ష నాయకులు గానీ హామీల గురించి ప్రశ్నిస్తే కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ హారిక దంపతులపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలను వెన్నుతట్టి ప్రోత్సహించారని, వారికి రాజ్యాధికారం పొందే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు బీసీలపై వివక్ష చూపిస్తూ.. వెనుకబడిన వర్గాల ప్రజలను అవమానిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేసే సమర్థత గానీ, రాష్ట్రాన్ని పాలించే హక్కు గానీ లేదన్నారు. కనీసం రాష్ట్రంలో మానవ హక్కులకు భంగం కలగకుండా పాలన సాగించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం బేషరతుగా బీసీలకు క్షమాపణ చెప్పాలని కె.కె.రాజు డిమాండ్ చేశారు.
హోం మంత్రి అనిత రాజీనామా చేయాలి
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ జిల్లా ప్రథమ మహిళకే రక్షణ కల్పించలేని దౌర్భగ్య పాలన రాష్ట్రంలో సాగుతోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మహిళల అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో 50 శాతం కేటాయిస్తే.. కూటమి ప్రభుత్వంలో మాత్రం మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలకు భద్రత కల్పించలేని రాష్ట్ర హోంమంత్రి అనిత తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు బొల్లవరపు జాన్ వెస్లీ, బానాల శ్రీనివాసరావు, పల్లా చినతల్లి, అల్లంపల్లి రాజుబాబు, జహీర్ అహ్మద్, పి.సతీష్ వర్మ, నడింపల్లి కృష్ణరాజు, ద్రోణంరాజు శ్రీ వత్సవ, జోనల్, జిల్లా అనుబంధ అధ్యక్షులు అంబటి శైలేష్, ఉరుకూటి రామచంద్రరావు, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పులగం కొండా రెడ్డి, సేనాపతి అప్పారావు, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, సకలాభక్తుల ప్రసాదరావు, రామిరెడ్డి, రాయపురెడ్డి అనిల్ కుమార్, ఎస్.లత, బొండా ఉమా మహేశ్వరరావు, నీలి రవి, దేవరకొండ మార్కండేయులు, కార్పొరేటర్లు అక్కరమాని పద్మ రామునాయుడు, దౌలపల్లి ఏడుకొండల రావు, కె.అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, శశికళ, పి.వి.సురేష్, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల కమిటీ నాయకులు దొడ్డి కిరణ్, బెందాళం పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌పై
దాడిని ఖండించిన నేతలు