
హెచ్‌ఎం బదిలీకి డిమాండ్
గోపాలపట్నం యల్లపువానిపాలెం ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎంను తక్షణమే బదిలీ చేసి, విద్యార్థులకు చదువులు చెప్పేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. హెచ్‌ఎం పాఠాలు చెప్పకుండా ఇతర పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ పాఠశాలలో నాల్గో తరగతికి క్లాస్ టీచర్ లేరని, ఉన్న ఒక్క హెడ్‌మాస్టర్ చదువు చెప్పడం లేదని విద్యార్థులు వాపోయారు. పలుకుబడి కలిగిన హెచ్‌ఎం పాఠశాలలో చదువులు చెప్పకుండా రాజకీయాలు చేస్తున్నారని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు.