
సోలార్ సైక్లింగ్.. ట్రెకింగ్!
లంకెపాలెం వద్ద 306.86 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం ప్రధానంగా కొండలు, అటవీ ప్రాంతంతో నిండి ఉంది. ఈ ప్రాంతంలో కొండ చుట్టూ సోలార్ సైక్లింగ్‌తో పాటు ట్రెక్కింగ్ సదుపాయాలను కల్పించాలని భావిస్తున్నారు. రోప్ ద్వారా ట్రెక్కింగ్‌కు ఏర్పాట్లు చేయడం ద్వారా ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక, ఇక్కడ అటవీ ప్రాంతం ఉండటంతో ఔషధ వనంతో పాటు మియావాకీ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేయాలనేది మరో ఆలోచన. అంతేకాకుండా, రాక్ గార్డెన్ ఏర్పాటుకు కూడా అవకాశం ఉందని గుర్తించారు. అదేవిధంగా, ప్రత్యేకంగా యువత కోసం అడ్వెంచర్, ఫిట్‌నెస్ జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉందని గుర్తించారు. మొత్తంగా, ఇప్పటివరకు ఖాళీగా ఉన్న విశాఖ పోర్టు భూముల్లో పర్యాటక, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా కాసుల పంట పండించుకోవాలని యాజమాన్యం సిద్ధమవుతోంది.