
అధ్వానంగా సదుపాయాలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. బీటీ రోడ్ల నుంచి మంచి నీటి సదుపాయాల వరకు అన్నింటినీ పనులను చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మౌలిక సదుపాయాల పనులన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికీ రోడ్ల పనులు పూర్తి కాలేదు. డ్రైనేజీలు కనిపించడం లేదు. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలను సైతం ఏర్పాటు చేయలేదు. వాస్తవనికి 2026 నాటికి ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని కూటమి ప్రజాప్రతినిధులు చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక్కో లేఅవుట్‌లో పదుల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి త్వరలో గృహ ప్రవేశ కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.