
రాజకీయ సిఫార్సులకే పెద్దపీట?
● ఉమ్మడి విశాఖలో బదిలీల దుమారం ● ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నో బదిలీ ● పెందుర్తిలో బాబ్జీకి భంగపాటు?
మహారాణిపేట: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగుల బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పించకపోవడం, అదే సమయంలో కీలకమైన పోస్టులను భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ బదిలీల ప్రక్రియలో కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలో జరిగిన తహసీల్దార్ల బదిలీలలో రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పెందుర్తి తహసీల్దార్ బదిలీ విషయంలో అక్కడి ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నారు. ఈ విషయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. భీమిలి ఎమ్మెల్యే సిఫార్సు మేరకే ఆనందపురం తహసీల్దార్‌ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన కారణంగా గాజువాక తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను కదపకపోవడం గమనార్హం. వీరితో పాటు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో కలిపి రెవెన్యూ శాఖలో మొత్తం 62 మందిని బదిలీ చేశారు.
పంచాయతీరాజ్‌లో 75 మందికి స్థానచలనం
జిల్లా పరిషత్‌లో కూడా భారీగా బదిలీలు జరిగాయి. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మొత్తం 75 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు ఎంపీడీవోలు, ఐదుగురు పరిపాలనాధికారులు, 4 సీనియర్ అసిస్టెంట్లు, 11 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, 12 మంది రికార్డు అసిస్టెంట్లు, 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ఆరుగురు నైట్ వాచ్‌మెన్లు ఉన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర పాల్గొన్నారు.
బదిలీ అయిన రెవెన్యూ అధికారులు వీరే..
మండలం/స్థానం తహసీల్దార్/ కేటాయించిన స్థానం
సూపరింటెండెంట్ పేరు
పెందుర్తి ఎం.ఆనందకుమార్ అనకాపల్లి జిల్లా
ములగాడ ఎం.భుజంగరావు అనకాపల్లి జిల్లా
కలెక్టరేట్(అల్లూరి) బి.నాగరాజు అనకాపల్లి జిల్లా
కలెక్టరేట్(అల్లూరి) ిసీహెచ్ తిరుమలరావు అనకాపల్లి జిల్లా
కలెక్టరేట్(అల్లూరి) ఎం.భాస్కరఅప్పారావు అనకాపల్లి జిల్లా
అల్లూరి జిల్లా టి.రామకృష్ణ పెందుర్తి మండలం
అల్లూరి జిల్లా ఎంవీవీపసాద్ ల్యాండ్ ప్రొటెక్షన్(విశాఖ)
కలెక్టరేట్(అనకాపల్లి) బీవీ రాణి మెజిస్టీరియల్ సెక్షన్(విశాఖ)
అచ్యుతాపురం జి.జనార్ధన్ అల్లూరి జిల్లా
ఆనందపురం పి.శ్యాంప్రసాద్ కోఆర్డినేషన్ సెక్షన్(విశాఖ)
(ఆనందపురం హెచ్‌డీటీ ఎల్.చేతన్ కుమార్ ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియామకం)
గాజువాక టి.శ్రీ వల్లి వీఎంఆర్డీఏ
(గాజువాక హెచ్‌డీటీ బి.శ్రీనివాసరావు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియామకం)
సీతమ్మధార ఎం.రమేష్‌ను ములగాడ
(సీతమ్మధార హెచ్‌డీటీ ఎస్.ఎ.త్రినాథరావు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియామకం)