వాన..ఈదురుగాలులు | - | Sakshi
Sakshi News home page

వాన..ఈదురుగాలులు

Jun 11 2025 7:46 AM | Updated on Jun 11 2025 7:46 AM

వాన..

వాన..ఈదురుగాలులు

మహారాణిపేట: మూడు రోజులుగా ఎండ వేడిమి, ఉక్కబోతతో అల్లాడుతున్న నగర వాసులకు మంగళవారం కురిసిన వర్షం ఎంతో ఉపశమనాన్నిచ్చింది. రుతుపవనాల రాక, వాతావరణంలో మార్పుల కారణంగా గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఒకవైపు ఉక్కబోత, మరోవైపు వేడి గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జోరున కురిసిన వర్షంతో పాటు వీచిన ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పందిమెట్ల, బుల్లయ్య కాలేజీ సమీపంలో భారీ వృక్షాలు కూలిపోయాయి. ఆశీలమెట్ట వద్ద ఈదురుగాలులకు హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు తెగిపడిపోయాయి. వర్షం తాకిడికి బీచ్‌రోడ్డులో అలల తాకిడి ఉధృతంగా మారింది. బీచ్‌ రోడ్డులో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపైకి నీరు చేరింది.

వాన..ఈదురుగాలులు 1
1/1

వాన..ఈదురుగాలులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement