టార్గెట్‌.. మనీ | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌.. మనీ

Jun 16 2023 6:10 AM | Updated on Jun 16 2023 6:10 AM

కిడ్నాపర్లు ఉపయోగించిన కారు - Sakshi

కిడ్నాపర్లు ఉపయోగించిన కారు

శుక్రవారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2023
● ఎంపీ ఎంవీవీ సతీమణి, కుమారుడితో పాటు ఆడిటర్‌ జీవీ కిడ్నాప్‌ ● ఒకరి ద్వారా మరొకరికి ఫోన్‌ చేయించి నిర్బంధం ● రూ.1.75 కోట్లు ఇచ్చినా కనికరించని కిడ్నాపర్‌ హేమంత్‌కుమార్‌ ● ఇప్పటికే అతడిపై రెండు కిడ్నాప్‌ కేసులు.. ఇటీవలే బెయిల్‌పై విడుదల ● తాజాగా ఎంపీ ఫ్యామిలీ టార్గెట్‌.. కొత్త గ్యాంగ్‌తో కిడ్నాప్‌ వ్యవహారం ● రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ముసుగులో నేర సామ్రాజ్యం విస్తరణ ● 4 గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు

8లో

సినీ ఫక్కీలో ఛేజింగ్‌

ఆనందపురం : ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌, ఆడిటర్‌ జి.వెంకటేశ్వరరావులను కిడ్నాప్‌ చేసిన నిందితులు మండలంలోని పందలపాకలో పట్టుబడడం సంచలనం సృష్టించింది. మొదట పోలీసులు వాహనాలతో ఛేజింగ్‌ చేయడంతో దొంగలను వెంటాడుతున్నారని అనుకున్న స్థానికులు.. తరువాత ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసిన నిందితులని తెలిసి విస్తుపోయారు. ఈ సంఘటన మండలంలో పెను సంచలనమైంది. ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌, ఆడిటర్‌ జి.వెంకటేశ్వరరావులను బంధించిన నిందితుల కారు ఆనందపురం వైపు వస్తుందని అందుకున్న సమాచారం మేరకు సీపీ త్రివిక్రమ్‌ వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటైన 15 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మండలంలోని నీళ్ల కుండీలు, ఆనందపురం, పద్మనాభం, అనంతవరం, బాకురుపాలెం తదితర జంక్షన్ల వద్ద పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఎంవీవీ స్టిక్టర్‌తో గల ఆడికారు నీళ్లకుండీల గుండా పద్మనాభం వైపు వాయువేగంతో దూసుకుపోయింది. దీంతో అక్కడ ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులు.. పద్మనాభం పోలీసులకు సమాచారం అందించారు. కాగా కిడ్నాపర్లు కారు బాకురుపాలెం క్వారీ సమీపంలోకి చేరుకునేసరికి టైరు పంక్చర్‌ అయింది. దీంతో నిందితులు కారును రోడ్డు పక్కన గల మార్గంలోకి తీసుకొని వెళ్లి టైరు మార్చారు. ఈలోగా నీళ్ల కుండీలు–పద్మనాభం రూట్లో పోలీసుల వాహనాలు సైరన్‌ మోగిస్తూ తిరుగుతుండడంతో కంగారు పడిన కిడ్నాపర్లు కిడ్నాప్‌ చేసిన ముగ్గురిని అక్కడే విడిచి పెట్టి కారుతో పరారయ్యారు. కారును గమనించిన పోలీసులు తమ వాహనాలతో వెంబడించారు. నిందితుల కారు బాకురుపాలెం వద్ద నుంచి ఎడమ వైపు మలుపు తిరిగి తర్లువాడ రోడ్‌లో ప్రవేశించింది. కారు పందలపాక జంక్షన్‌ సమీపంలోకి చేరుకునే సరికి ఎదురుగా పోలీసులు వాహనాలు వచ్చాయి. అయినా కిడ్నాపర్లు తమ కారును నిలుపుదల చేయలేదు. దీంతో పోలీసులు తెగించి ఎదురుగా వస్తున్న కిడ్నాపర్ల వాహనాన్ని తమ వాహనంతో ఢీకొట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో కారును కుడివైపు పొలాల్లోకి దింపి పరారు కావడానికి ప్రయత్నించగా ముందు టైర్లు పంక్చర్‌ అయ్యాయి. కొంత దూరం వెళ్లేటప్పటికి కారు తుప్పల్లో ఆగిపోయింది. దీంతో కారు దిగి నిందితులు పరారవుతుండగా పోలీసులు వెంబడించారు. ఈ లోగా స్థానికులు అక్కడకు చేరుకొని పట్టుకోవడానికి ప్రయత్నించగా నిందితులు కత్తితో బెదిరించారు. అయినా పోలీసులు, స్థానికులు వెంబడించి నిందితులు కోలా హేమంత్‌ కుమార్‌, రాజేష్‌ను పట్టుకున్నారు. వారిని ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సీపీ త్రివిక్రమ్‌వర్మ, డీసీపీ–1 విద్యాసాగర్‌ నాయుడు, డీపీ–2 ఆనందరెడ్డి, క్రైం డీసీపీ గంగాధర్‌లు నిందితులను విచారించారు. పరారైన వారి కోసం గాలిస్తున్నారు. కిడ్నాపర్ల కారును నిలువరించే సమయంలో ఢీ కొట్టిన పోలీసు వాహనంలోని ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

డయల్‌ యువర్‌ సీపీకి

26 ఫిర్యాదులు

దొండపర్తి(విశాఖ దక్షిణ): పక్కాగా స్కెచ్‌ వేశాడు. ఎంపీ నగరంలో ఉండరని తెలుసుకున్నాడు. అతని కుమారుడు ఇంట్లో ఒక్కడే ఉన్నట్లు గుర్తించాడు. అతడిని కిడ్నాప్‌ చేస్తే రూ.కోట్ల వర్షం కురుస్తుందని భావించాడు. ఇందుకోసం కొత్త గ్యాంగ్‌ను రంగంలోకి దింపాడు. అదును చూసి ఇంట్లోకి చొరబడ్డాడు. మెడపై కత్తి పెట్టి అతని తల్లికి.. ఆ తరువాత ఆమె ద్వారా ఎంపీ సన్నిహితుడు జీవీకి ఫోన్‌ చేయించి రప్పించి.. వారందరినీ ఇంట్లోనే 48 గంటల పాటు నిర్బంధించి డబ్బు కోసం దాడి చేశాడు. రూ.1.75 కోట్లు ఇచ్చినా ఇంకా కావాలని డిమాండ్‌ చేశాడు రౌడీషీటర్‌ కోలా వెంకట హేమంత్‌ కుమార్‌. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారం వెనుక హేమంత్‌కుమార్‌ ప్రీ ప్లాన్డ్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పక్కాగా రెక్కీ నిర్వహించి.. కిడ్నాప్‌ కోసం ఒక కొత్త గ్యాంగ్‌ను సిద్ధం చేసుకొని.. వారితో పకడ్బందీగా ప్లాన్‌ చేసుకొని.. ఇంట్లో ఒకరే ఉన్న సమయం కోసం ఎదురుచూసి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. విషయం ఆలస్యంగా పోలీసుల దృష్టికి వెళ్లినప్పటికీ.. కేవలం నాలుగు గంటల్లోనే హేమంత్‌కుమార్‌ గ్యాంగ్‌కు చెక్‌పెట్టారు. కిడ్నాపర్ల చెర నుంచి ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ కేసులో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తును చేపడుతున్నారు. ఇందులో మరో ఐదుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

12 కేసుల్లో సూత్రదారి..

ఎంపీ ఫ్యామిలీని టార్గెట్‌ చేసి..

భీమిలి ప్రాంతానికి చెందిన కోలా వెంకట హేమంత్‌కుమార్‌పై 12 కేసులు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్‌ నాయకురాలు విజయారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే గత ఏడాదిలో రామకృష్ణ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని కిడ్నాప్‌ చేసిన కేసులో అరెస్ట్‌ అయ్యాడు.

కొన్ని నెలల పాటు జైలులో ఉండి బయటకు వచ్చారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుసూదనరావు అనే మరో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని కిడ్నాప్‌ చేశాడు. అతడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి రూ.20 లక్షలు డిమాండ్‌ చేసి చివరకు రూ.12 లక్షలు కాజేశాడు. అయితే మధుసూదనరావు వారి చెర నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో అప్పుడు కూడా గంటల వ్యవధిలోనే హేమంత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. జైలు నుంచి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్‌ తాజాగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీనే టార్గెట్‌ చేసుకున్నాడు.

దొండపర్తి(విశాఖ దక్షిణ): డయల్‌ యువర్‌ సీపీ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే చట్టపరంగా పరిష్కరించాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ సి.ఎం.త్రివిక్రమ్‌ వర్మ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి 26 మంది ఫోన్‌ చేసి సీపీకి ఫిర్యాదులు చేశారు. సీపీ త్రివిక్రమ్‌ వర్మ ప్రతి ఒక్క కాలర్‌తో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ సంబంధిత అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వెంటనే ఆ ఫిర్యాదులను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై డయల్‌ యువర్‌ సీపీ కార్యక్రమం ద్వారా స్వయంగా ఫిర్యాదు చేయాలంటే 0891–2523408 నెంబర్‌కు కాల్‌ చేయాలని సీపీ త్రివిక్రమ్‌ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ(అడ్మిన్‌) ఎం.ఆర్‌.కె.రాజు, ఏడీసీపీ(ఎస్‌బీ) నాగేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

ఎంపీకి కృష్ణయ్య పరామర్శ

రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ఫోన్‌లో ఎంపీ ఎంవీవీని పరామర్శించారు. ఎంపీ ఎంవీవీని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికారి ప్రతినిధి కర్రి వేణుమాధవ్‌ కలిసి వివరాలు అడిగితెలుసుకున్నారు.

ముందు భాగం దెబ్బతిన్న పోలీసు వ్యాన్‌ 
1
1/2

ముందు భాగం దెబ్బతిన్న పోలీసు వ్యాన్‌

కాలర్‌తో మాట్లాడుతున్న సీపీ త్రివిక్రమ్‌ వర్మ 
2
2/2

కాలర్‌తో మాట్లాడుతున్న సీపీ త్రివిక్రమ్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement