అనంతగిరి: సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ప్రజా ఉద్యమాలను అణిచి వేయాలని చూడటం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రభుత్వ నిర్బంధ పాలనను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులైనా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, భారతి, బాలమణి, మంగమ్మ, యాదమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ


