కుల్కచర్ల: పాంబండ రామలింగేశ్వర ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, ఈఓ బాలనర్సయ్య తెలిపారు. శ్రావణమాస ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. రూ.3,67,060 సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారి పాండు శర్మ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: మున్సిపల్ కార్మికులు 12 రోజుల పోరాటాల ఫలితంగా పెండింగ్ జీతాలు విడుదల చేయించిన చైర్పర్సన్ గడ్డం అనన్య, సహకరించిన స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. ఇకపై ప్రతినెలా వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికుల వైద్య సేవల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. కనీస వేతనం రూ. 32,000 చెల్లించాలని తెలిపారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్సగ్రేషియా చెల్లించాలన్నారు. వేతనాల విడుదలకు కృషి చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సెర్ప్ డీపీఎం నర్సింలు
దౌల్తాబాద్: గ్రామాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని సెర్ప్ డీపీఎం నర్సింలు సూచించారు. బుధవారం దౌల్తాబాద్‌లో మండల మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రతి సభ్యురాలికి వివరించాలని సూచించారు. రుణాల రికవరీ చేయాలన్నారు. సకాలంలో మహిళలు బ్యాంకు రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం మహిళల అ భ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకన్న, సీసీలు రామకృష్ణ, బాల్‌రాజు, జయమ్మ. జయమ్మ, రాజు, మండ ల మహిళా అధ్యక్షురాలు నర్సమ్మ, కోశాధికారి భీమమ్మ, కార్యదర్శి యశోద పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల హెచ్ –82 జిల్లా కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా సుభాన్
అనంతగిరి: తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ హెచ్ 82 జిల్లా, డివిజన్ కమిటీలను బుధవారం పట్టణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజీఎస్ పీడీసీఎల్ కంపెనీ యూనియన్ సెక్రటరీ కే వెంకటేష్, జాయింట్ సెక్రటరీ ఎండీ జమీల్, జిల్లా మాజీ అధ్యక్షుడు బీ జైపాల్‌రెడ్డి అధ్యక్షతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ విద్యుత్ సరఫరాలో కీలక సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టిజన్ కార్మికులకు సంబంధించిన సమస్యలు, హక్కుల సాధన కోసం యూనియన్ తరఫున నిరంతరం పోరాటం చేస్తామని నూతన కమిటీ నాయకులు తెలిపారు. కమిటీ జిల్లా అధ్యక్షుడిగా సుభాన్, ప్రధాన కార్యదర్శిగా వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్, వికారాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా రామాంజనేయులు, తాండూరు అధ్యక్షుడిగా లాలు, ప్రధాన కార్యదర్శి కృష్ణ నియమితులయ్యారు.


