ఉత్సవాలకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలకు సహకరించండి

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

ఉత్సవాలకు సహకరించండి

జిల్లాలో గణేశ్‌ మండపాలు 2,384

వికారాబాద్‌: ‘గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలకు పోలీస్‌ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.. పూజలు మొదలుకొని నిమజ్జనం వరకు ప్రశాంతంగా జరుపుకోవాలి.. మన సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలు ఉండాలి.. డీజేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే పలువురిని బైండోవర్‌ చేశాం’ అని ఎస్పీ స్పేహ మెహ్ర అన్నారు. మండపాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లు, రూట్‌ మ్యాప్‌ తదితర అంశాలపై బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో 2,384 గణేశ్‌ మండపాలకు పోలీస్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా భక్తి పాటలు పెట్టుకోవచ్చు. డీజేలు పెట్టిన ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. నిమజ్జన సమయంలో భజన, కోలాటానికి అనుమతులు ఉన్నాయి.

రూట్‌ మ్యాప్‌ పాటించాలి

అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో పీస్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాం. నిబంధనలపై అవగాహన కల్పించాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాం. విగ్రహం ప్రతిష్ఠించిన ఐదో రోజు తాండూరులో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసి మండప నిరాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేస్తున్నాం. చెరువులకు వెళ్లే దారులకు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నాం. ఏయే పట్టణంలో ఏయే దారిలో వెళ్లాలి.. ఏ సమయంలోపు నిమజ్జనం చేయాలి అనే విషయాలు తెలియజేశాం. విగ్రహాన్ని ఒకే వాహనంతో తరలించాలి. రెండో వాహనానికి అనుమతి లేదు. విద్యుత్‌ తీగలు ఉన్న చోట జాగ్రత్తలు పాటించాలి. మద్యం, గాంజాయి సేవించి ఉత్సావాల్లో పాల్గొనరాదు. నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. బానసంచా పేల్చరాదు. రద్ది ఉండే ప్రదేశాలు, మండపాల వద్ద నిర్వాహకులు బారికేడ్లు, లైటింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైతే వలంటీర్లను నియమించుకోవాలి. పోలీసులు సూచించిన మార్గంలోనే వాహనాలు వెళ్లాలి. రూటు మార్చకూడదు.

ఉదయమే శోభాయాత్ర ప్రారంభించాలి

సాధ్యమైనంత వరకు ఉదయమే శోభాయాత్రను ప్రారంభించాలి. దీంతో యువతి, యువకులు మహిళలు, పిల్లలు, వృద్ధులు తిలకించటానికి వీలవుతుంది. చీకటి పడక ముందే నిమజ్జనం చేయవచ్చు. నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలి. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 8712670056కు కాల్‌ చేయాలని ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు.

నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలి

రూట్‌ మ్యాప్‌ను తప్పనిసరిగా పాటించాలి

డీజేలకు అనుమతి లేదు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

అందుబాటులో టోల్‌ ఫ్రీ నంబర్‌ 87126 70056

‘సాక్షి’తో ఎస్పీ స్పేహ మెహ్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement