కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

కఠిన చర్యలు

May 21 2026 10:13 AM | Updated on May 21 2026 10:13 AM

రైతులను

మోసం చేస్తే

బషీరాబాద్‌: వరి ధాన్యం తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ దీపక్‌ తివారి హెచ్చరించారు. ప్యాడీ క్లీనర్‌కు వేశాకే బస్తాకు 40.6 కేజీలు కాంటా చేయాలని ఆదేశించారు. బుధవారం బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎంత తాలు పోతే అంతే అదనంగా తూకం వేయాలని రైతులు కోరారు. గన్నీ బ్యాగులు లేవని ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి

ఇందిరమ్మ పైలెట్‌ గ్రామం కాశీంపూర్‌లో ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జూన్‌ మాసంలో రెండు విడత ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. పునాది వేసినా బిల్లు రాలేదని నర్సమ్మ కలెక్టర్‌కు విన్నవించారు. లోకేషన్‌ రాని కారణంగా బిల్లు రాలేదని అధికారులు సమాధానం ఇచ్చారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ వంద శాతం ఎందుకు పూర్తి చేయలేదని ఏఈఓ అనితను కలెక్టర్‌ ప్రశ్నించారు. 77 శాతం పూర్తి చేసినట్లు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనులు సక్రమంగా జరగ డం లేదని సర్పంచ్‌ హరిత కలెక్టర్‌ దృష్టికి తెచ్చా రు. పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధి కారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ అనిత, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ షాహెదాబేగం, ఎంపీడీఓ సంపత్‌కుమార్‌, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

యాలాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ దీపక్‌ తివారి హెచ్చరించారు. బుధవారం మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తూకం సరిగ్గా చేయడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. కేంద్ర నిర్వాహకులపై కలెక్టర్‌ ఆగ్రహ వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధన మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అగ్గనూరు గ్రామంలో జరుగుతున్న జనగణన ప్రక్రియ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ వెంకటస్వామి, ఎంపీడీఓ శ్రీనిజ, డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, ఎంఈఓ మహిపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ధాన్యం సేకరణ సజావుగా సాగాలి

కలెక్టర్‌ దీపక్‌ తివారి

Advertisement
 
Advertisement
Advertisement