ప్రజల రక్షణకే కార్డెన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల రక్షణకే కార్డెన్‌ సెర్చ్‌

May 21 2026 10:13 AM | Updated on May 21 2026 10:13 AM

యాలాల: ప్రజల రక్షణ, భద్రత కోసమే కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య తెలిపారు. బుధవారం మండలంలోని ఇందిరమ్మ కాలనీలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి చేపట్టిన కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమంలో భాగంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో ఉంటున్న ఇద్దరు రౌడీ షీటర్లు, ఇద్దరు అనుమానితుల ఇళ్లను పూర్తిగా తనిఖీ చేసినట్లు తెలిపారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కాలనీవాసులు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐలు పరమేష్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రఘు, ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

కేసుల్లో పురోగతి సాధించాలి

బషీరాబాద్‌: పెండింగ్‌ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య ఆదేశించారు. బుధవారం బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. మండలం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య

Advertisement
 
Advertisement
Advertisement