పరిగి: సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్‌డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం పరిగి తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు, ఓటర్లు సహకరించాలని కోరారు. ఎన్నికల సిబ్బంది ఇంటింటి సర్వే చేసి డబుల్ ఓట్లు, మృతి చెందిన వారిని జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామన్నారు. అందులో ఏమైన అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30లోగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 18 సంత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అక్టోబర్ ఒకటిన తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, అనిల్‌బాబు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఆర్‌డీఓ వాసుచంద్ర


