భానుడి భగభగలు
సాగర్ హైవే నిర్మానుష్యం
యాచారం: మండుతున్న ఎండలకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. భానుడి భగభగతో రోడ్లకు మీదకు ప్రజలు రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. మండే ఎండలకు బుధవారం యాచారం మండల కేంద్రంలోని సాగర్ హైవే వాహనాలు రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారింది. రోడ్లకు మీదకు వచ్చిన ప్రజలు ఎండలకు ఉపశమనం కోసం కొబ్బరిబొండాలు తాగడం, శీతలపానీయాలు సేవించారు. ఎండల తీవ్రతకు యాచారం మండల కేంద్రంతో పాటు మాల్ వ్యాపార కేంద్రంలో వ్యాపార దుకాణాల్లో క్రయ, విక్రయాలకు కూడా ప్రజలు రావడానికి భయపడుతున్నారు.
యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)ల నామినేటెడ్ పదవులపై ఆశావహులు కన్నేశారు. సర్కార్ పీఏసీఎస్ పాలకవర్గాలను నామినేటెడ్ చేస్తామని ప్రకటించడంతో వాటిని దక్కించుకోవడం కోసం నేతలు పైరవీలు మొదలుపెట్టారు. నేటికి అధికారిక ఉత్తర్వులు జారీ కానప్పటికీ, కచ్చితంగా నామినేటెడ్ చేస్తుందనే సంకేతాలతో నాయకులు ఆశావహులు మండల స్థాయి నేతలు, సర్పంచులను కలుస్తూ మద్దతుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామాల్లో గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన వారు, సీనియర్ నేతలు పీఏసీఎస్ పదవులపై ఆసక్తి చూపుతున్నారు. పీఏసీఎస్ పదవులను నామినేటెడ్ చేస్తుందనే సమాచారంతో జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని పీఏసీఎస్‌ల సీఈఓలు కలిసి చర్చించారు. నిబంధనలు, విధివిధానాలు జారీ అయిన తర్వాత మరోమారు సమావేశమై చర్చిద్దామని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రతి పీఏసీఎస్‌కి 13 మంది సభ్యుల రిజర్వేషన్ల వివరాలను సైతం ఖరారు అయినట్లు సమాచారం.
ఎమ్మెల్యే సూచన మేరకే
పీఏసీఎస్‌ల పాలకవర్గాల నామినేటెడ్ పద్ధతిపై ఎమ్మెల్యే అనుకున్న పేర్లతో కూడిన నివేదికను సహకార శాఖ ఉన్నతాధికారులు ఫైనల్ చేసే అవకాశం ఉంది. అందుకే ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని ఆయా మండలాల్లోని ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా డివిజన్‌లోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే రంగారెడ్డి తాను అనుకున్న వారికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేత ఉత్తర్వులు జారీ చేయించారు. అదే మాదిరిగా పీఏసీఎస్‌ల పాలకవర్గాల సభ్యుల ఎంపిక విషయంలో పదవులు వచ్చే అవకాశం ఉంది.
మొండిబకాయిదారులకు నో చాన్స్
పీఏసీఎస్ పాలకవర్గాల సభ్యుల నామినేటెడ్ విషయంలో మొండి బకాయిదారులకు నో చాన్స్ అంటూ అధికారులు అంటున్నారు. ఈ మేరకు లిస్టును తయారు చేస్తున్నారు. డివిజన్‌లోని యా చారం, మంచాల, ఉప్పరిగూడ, ఆర్‌కే మైలారం, ఎంపీ పటేల్‌గూడ, పోల్కంపల్లి పీఏసీఎస్‌లున్నాయి. అందులో దాదాపు 25,755కు పైగా సభ్యులు ఉన్నారు. వారిలో సగానికి పైగా మంది రైతులు ఆయా పీఏసీఎస్‌లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక, బంగారు, వ్యక్తిగత రుణాలు పొందారు. వారిలో దాదాపు 25 శాతానికి పైగా డిఫాల్టర్లుగా ఉన్నారు. అందులో అత్యధికంగా రాజకీయ పార్టీలకు చెందిన వారే ఉన్నారు. ప్రస్తుతం డిఫాల్టర్లకు నామినేటెడ్ పదవుల ఎంపిక విషయంలో నిబంధనలు కఠినంగా ఉండడంతో వారు పదవులకు అర్హత కోల్పోయే అవకాశం లేకపోలేదు.
తిరుగులేని సంస్థ భారతి సిమెంట్
ఇబ్రహీంపట్నం డివిజన్‌లో పీఏసీఎస్‌లు
పీఏసీఎస్ సభ్యులు
యాచారం 8,429
మంచాల 6,553
ఉప్పరిగూడ 2,644
ఆర్‌కే మైలారం 3,844
పోల్కంపల్లి 1,436
ఎంపీ పటేల్‌గూడ 2,849
పీఏసీఎస్‌ల పాలకవర్గాలను నామినేట్ చేయనున్న సర్కార్
సభ్యుల ఎంపికకు రిజర్వేషన్లు ఖరారు
పదవులకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన నాయకులు
ఎమ్మెల్యే రంగారెడ్డిని కలిసిన జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్


