సీఎం చొరవతో మహర్దశ | - | Sakshi
Sakshi News home page

సీఎం చొరవతో మహర్దశ

May 21 2026 10:13 AM | Updated on May 21 2026 10:13 AM

ఆమనగల్లు/కడ్తాల్‌: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి మహర్దశ కలిగిందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా నియమితులైన సూదిని రాంరెడ్డికి సన్మాన కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, సీఎం రేవంత్‌రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి, విద్యాకమిషన్‌ సభ్యుడు చారకొండ వెంకటేశ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసి రేవంత్‌రెడ్డి సీఎం కావడం కల్వకుర్తి ప్రజలకు గర్వకారణమని, సీఎం సహకారంతో కల్వకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సీఎం నిర్మిస్తున్న ఫ్యూచర్‌ సిటీతో ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తా

గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా తన పదవిని బాధ్యతా యుతంగా నిర్వర్తిస్తానని సూదిని రాంరెడ్డి చెప్పారు. ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు రాంరెడ్డిని కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని కాంగ్రెస్‌పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు దివంగత జైపాల్‌రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున సత్కరించారు. మార్గమధ్యలో మైసిగండి ఆలయంలో రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బాలాజీసింగ్‌, గీత, భాస్కర్‌రెడ్డి, పత్యానాయక్‌, ఆనంద్‌కుమార్‌, కిషన్‌రెడ్డి, కేశవులు, నర్సింహ, జగన్‌, బిచ్చానాయక్‌, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement