ఉపాధికూలీలపై తేనెటీగల దాడి | - | Sakshi
Sakshi News home page

ఉపాధికూలీలపై తేనెటీగల దాడి

May 21 2026 10:13 AM | Updated on May 21 2026 10:13 AM

కుల్కచర్ల: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 35మంది కూలీలు రామలింగేశ్వర కళాశాల పరిసర ప్రాంతంలో పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 10గంటల ప్రాంతంలో తేనెటీగలు వారిపై దాడి చేశాయి. ఈ హఠాత్పరిణామానికి వారందరూ పరుగులు పెట్టగా.. ఇద్దరు తీవ్రంగా, మిగతావారు స్వల్పంగా గాయపడ్డారు. ఓ మహిళ కిందపడి గాయపడింది. బాధితులను తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మహబూబ్‌నగర్‌కు తరలించారు. గాయపడిన వారిని సర్పంచ్‌ అంజిలయ్య, ఉప సర్పంచ్‌ విజయకుమార్‌, కాంగ్రెస్‌ నేతలు భీంరెడ్డి, ఆంజనేయులు, జోగు వెంకటయ్య, గోపాల్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ మల్లికార్జున్‌ పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement