తాండూరు: మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ పాల్గొన్నారు. నాలుగు స్థానాలకు గాను 12 మంది నామినేషన్లు వేశారు. అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు నలుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికై న వారిలో సుభాష్, మహ్మద్ రహీం, చిన్నోళ్ల సరిత, అఫ్రీన్ జవేరియా ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదర్‌రెడ్డి తెలిపారు. నూతనంగా ఎన్నికై న వారిని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సన్మానించారు. ఈ ఎన్నికకు బీఆర్‌ఎస్‌కు చెందిన 12 మంది కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు.
విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
పదో తరగతిలో ఉతీర్ణత సాఽధించిన విద్యార్థులను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అభినందించారు. బుధవారం పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్‌లో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజతో కలిసి అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓలు నర్సింగ్‌రావు, మహిపాల్‌రెడ్డి, ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు.


