కొడంగల్: ప్రజా ప్రతినిధులు బాధ్యతగా మెలగా లని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం కడా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వస తులు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులను సన్మానించారు. కార్యక్రమంలో కడా ప్రత్యే కాధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, మున్సి పల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, ఎంఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి


