పరిగి: బీసీ గణన చేసినప్పుడే న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ అన్నారు. బుధవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు. వారి పరిస్థితులను సమగ్రంగా అంచనా వేయాలంటే కుల ఆధారిత జనగణన అత్యంత కీలకమన్నారు. సరైన గుణాంకాలు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ నియోజకవర్గ అధ్యక్షుడు సదానందం, నాయకులు ఆనంద్, పులేందర్, వెంకటయ్య, లింగయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సంఘం జాతీయ కార్యదర్శి హన్మంతు ముదిరాజ్


