పేదల వైద్యుడి కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

పేదల వైద్యుడి కన్నుమూత

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

బొంరాస్‌పేట: యాభై ఏళ్ల క్రితం సైకిల్‌పై పల్లెలకు, గిరిజన తండాలకు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను పరీక్షించి, వైద్యం అందించిన దూగుర్‌ రాఘవేంద్రచారి(90) బుధవారం మృతిచెందారు. మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఎంపీహెచ్‌ఏ)గా పనిచేసిన ఆయన గ్రామీణ ప్రజలకు యాభై ఏళ్ల పాటు వైద్యం చేసి, పేదల వైద్యుడిగా మంచి పేరు సంపాదించారు.

కల్లు దుకాణం వద్ద

మహిళ మృతి

బొంరాస్‌పేట: మండలంలోని నాందార్‌పూర్‌లో ఓ మహిళ కల్లు దుకాణం వద్ద మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంబళ్ల తుల్జమ్మ(53) సోమవారం రాత్రి 8 గంటలకు కల్తీకల్లు తాగి ఇంటికి తిరిగి వస్తుంటే దుకాణం సమీపంలో కిందపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం మృతురాలి తండ్రి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీకల్లు కారణంగానే తుల్జమ్మ చనిపోయిందని ఆమె తండ్రి ఆరోపించారు.

విద్యాభివృద్ధికి పెద్దపీట

షాద్‌నగర్‌: ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు పెద్దపీట వేస్తోందని అదనపు కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్‌లు, వార్డు కౌన్సిలర్లకు విద్యాభివృద్ధిపై వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement