అడిషనల్‌ డీఆర్‌డీఓగా సత్తయ్య | - | Sakshi
Sakshi News home page

అడిషనల్‌ డీఆర్‌డీఓగా సత్తయ్య

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

అడిషనల్‌ డీఆర్‌డీఓగా సత్తయ్య దరఖాసుల ఆహ్వానం రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రశాంత్‌

అనంతగిరి: జిల్లా అడిషనల్‌ డీఆర్‌డీఓగా సత్తయ్య మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఆయన సంగారెడ్డి జిల్లాలో ఎంపీడీగా పనిచేశారు. పదోన్నతిపై జిల్లాకు వచ్చారు.

అనంతగిరి: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతి ప్రవేశం కోసం అర్హులైన గిరిజన విద్యార్థిని, విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్టీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి కమలాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జిల్లా వాసులు అయి ఉండాలన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5గంటలలోపు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సమర్పించాలన్నారు. విద్యార్థి 01–06–2019 నుంచి 31–05 –2020 మధ్య కాలంలో జన్మించి ఉండాలన్నారు. కులం, ఆదాయం, నివాసం, ఆధార్‌ కార్డు, ఒక పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో జతచేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ నంబర్‌ 8639388553లో సంప్రదించాలన్నారు.

దరఖాస్తు చేసుకోండి

అనంతగిరి: వికారాబాద్‌ ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్‌ ఐటీఐ ప్రిన్సిపల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల 8 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్‌ 9177472488లో సంప్రదించాలన్నారు.

16, 18 తేదీల్లో కౌన్సెలింగ్‌

అనంతగిరి: హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం సీట్ల భర్తీకి ఈ నెల 16న బాలురకు, 18న బాలికలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రీజినల్‌ కోఆర్డినేటర్‌ నాగార్జునరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జిన్నారం(సంగారెడ్డి)కళాశాలలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఎల్‌టీ గ్రూప్‌ల్లో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో రావాలని సూచించారు.

అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌

అనంతగిరి: కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం నగరం నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను సిద్ధం చేసుకోవాలన్నారు. హమాలీల సంఖ్య పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి సుదర్శన్‌, మేనేజర్‌ మోహన్‌ కృష్ణ, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి నాగార్జున, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌రూరల్‌: బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా పసుపుల ప్రశాంత్‌ నియమితులయ్యారు. పట్టణంలోని కార్యాలయంలో బీసీ జనసేన జాతీయ అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో మంగళవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌కు నియామక పత్రం అందజేశారు. అనంతరం ప్రశాంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలందరినీ ఏకంచేసి బీసీ జనసేనను ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ జనసేన నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ, పట్టణ అధ్యక్షురాలు కాటం రాజ్యలక్ష్మిగౌడ్‌, నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్‌, నాయకులు సత్యం, రాములు, వెంకటయ్య, సాయి, తరుణ్‌, వసంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement