ప్రజల భద్రతలో రాజీ పడొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రతలో రాజీ పడొద్దు

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

తాండూరు: ప్రజల భద్రత విషయంలో రాజీ పడరాదని ఎస్పీ స్నేహమెహ్ర ఆదేశించారు. మంగళవారం తాండూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమాండ్‌ కట్రోల్‌ రూమ్‌, స్టేషన్‌ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా పీస్‌ కమిటీలు నిర్వహిస్తామన్నారు.

అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

తాండూరు రూరల్‌: ఇసుక, మత్తు పదార్థాలు, రేషన్‌ బియ్యం, కల్తీ విత్తనాల విక్రయం, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. మంగళవారం పెద్దేముల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాకప్‌ గదులు, రికార్డులు, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. మండలం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతర్రాష్ట్ర దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన ఛేదించాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకోవాలన్నారు. డయల్‌ 100కు వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రశాంత్‌ వర్ధన్‌, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

బక్రీద్‌ పండుగ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి

ఎస్పీ స్నేహమెహ్ర

Advertisement
 
Advertisement
Advertisement