‘ఇందిరమ్మ’ నిబంధనలు సడలించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ నిబంధనలు సడలించాలి

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

తాండూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉన్న నిబంధనలను సడలించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లపై చర్చించారు. తాండూరు పట్టణ శివారులో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ ఇళ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. స్పందించిన మంత్రులు ఈ నెల 25న తాండూరుకు వస్తామని, అప్పటిలోగా సీసీ రోడ్లు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బషీరాబాద్‌ మండలంలో నీళ్లపట్టి – మైల్వార్‌ అటవీ ప్రాంతంలో ఆక్రమణకు గురైన వందలాది ఎకరాల భూములను కర్ణాటక వాసుల చెర నుంచి విముక్తి కల్పించాలని మంత్రులను కోరారు. స్పందించిన వారు సర్వే చేసి నివేదిక అందజేయాలని డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మంత్రులను కోరిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

నగరంలో ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement