టీఎన్జీఓ నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

టీఎన్జీఓ నూతన కార్యవర్గం ఎన్నిక

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా ఊటు యశ్వంత్‌ ఎన్నికయ్యారు. రాష్ట్ర టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌, కార్యదర్శి హుస్సేన్‌ ఆదేశాల మేరకు మంగళవారం నాంపల్లి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీ కేంద్ర సంఘం అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ముత్యాల సత్యనారాయణ గౌడ్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా యశ్వంత్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా మాధవ్‌గౌడ్‌ (హెచ్‌డబ్ల్యూఓ), వైస్‌ ప్రెసిడెంట్‌ రంగయ్య (అగ్రికల్చర్‌), అంజాద్‌ అలీ (వైద్య), రాజశేఖర్‌ (రెవెన్యూ), వాణి (ప్రణాళిక), కార్యదర్శి శ్రీనివాస్‌రావు (మెడికల్‌), జాయింట్‌ సెక్రట్రీలుగా శ్రీనివాస్‌, గాయత్రి, కార్తీక్‌, అమృత, ట్రెజరరీ ఆనంద్‌సింగ్‌ (రెవెన్యూ), ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గంగాధర్‌, పబ్లిక్‌ సెక్రట్రీ శివకుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా మల్లేష్‌గౌడ్‌, నసీరుద్దీన్‌, వెంకట్‌రెడ్డి, విజిత శేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న యశ్వంత్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement