తండ్రి కనిపించడం లేదని.. | - | Sakshi
Sakshi News home page

తండ్రి కనిపించడం లేదని..

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

తండ్రి కనిపించడం లేదని..

మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య

మీర్‌పేట: గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిన తండ్రి తిరిగి రాలేదన్న మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కేశంపేటకు చెందిన బుయ్యకారి చంద్రశేఖర్‌రావు (26) ప్రైవేటు ఉద్యోగి. గత నెల 24న తన తండ్రి రవీందర్‌తో గొడవ జరిగింది. మరుసటి రోజు తండ్రి యథావిధిగా విధులకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కేశంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రిని వెతికేందుకు ఈ నెల 3న నగరానికి వచ్చాడు. మధ్యలో తల్లికి ఫోన్‌ చేసి ఇంటికి వచ్చాడా లేదా అన్న సమాచారం అడిగి తెలుసుకునేవాడు. ఈ నెల 11న చంద్రశేఖర్‌రావు బడంగ్‌పేటలోని దుర్గా వైన్స్‌ సమీపంలో పెట్రోల్‌ పోసుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి శోభారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement