అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. సీఐ రఘుకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని 45–50 సంవత్సరాల వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మృతుని జేబులో ఆధార్‌కార్డు లభించింది. ధాని ఆధారంగా అతని పేరు చాకలి బందయ్య లక్నాపూర్ గ్రామం రంగారెడ్డి జిల్లా అని తెలిసిందన్నారు. అతని మృతి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
దౌల్తాబాద్: మండలంలోని నందారం చిన్న నందిగామ రోడ్డుపై ఉన్న వరికుప్ప కారణంగా బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నందారం గ్రామానికి చెందిన బంటు కృష్ణ బైక్‌పై కొడంగల్‌కు బయలుదేరాడు. గ్రామ సమీపంలో రోడ్డుపై వరికుప్పలు ఆరబెట్టి పక్కనే రాళ్లు ఉంచారు. బైక్ రాళ్లకు గడలంతో కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలించారు.
యాలాల: ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక అక్రమంగా ఓ ట్రాక్టర్‌ను యాలాల పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అడాల్‌పూర్ నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఓ ట్రారక్టర్‌ను పట్టుకొని పీఎస్‌కు తరలించారు. పట్టుబడ్డ వాహనం అడాల్‌పూర్‌కు చెందిన బాలప్పదిగా గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.
డయల్ యువర్ డీఎంలో షాద్‌నగర్ డీఎం ఉష
షాద్‌నగర్‌రూరల్: ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని డీఎం ఉష అన్నారు. మంగళవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు పలువురు ప్రయాణికులు ఫోన్ చేసి సమస్యలు ఆమె దృష్టికి తెచ్చారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన డీఎం ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం షాద్‌నగర్ డిపోకు చెందిన రెండు డీలక్స్ బస్సులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. హైదరాబాద్–ఆత్మకూరు, హైదరాబాద్–జూరాల డీలక్స్ బస్సుల అప్ అండ్ డౌన్ కోసం ఆన్‌లైన్‌లో టికెట్స్ తీసుకోవచ్చని సూచించారు.
తుర్కయంజాల్: రైతు సేవా సహకార సంఘం పీఐసీ చైర్మన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన కొత్తకుర్మ సత్తయ్య, డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డిని మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. రైతులకు మొరుగైన సేవలు అందించాలని, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగ్ విష్ణువర్ధన్ రావు, ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల నరేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క జంగయ్య గౌడ్, బీజేపీ నాయకులు బచ్చిగళ్ల రమేష్, తూళ్ల నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


