● మూడు టిప్పర్లు స్వాధీనం
● అడ్డుకున్న వారిపై కేసు నమోదు
కేశంపేట: అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. టిప్పర్లతో పాటు పోలీస్ విధులకు ఆటంకం కల్పించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగెం గ్రామ శివారులో సోమవారం రాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మూడు టిప్పర్లు మట్టిని తరలిస్తున్నట్టు గుర్తించి వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. మార్గమాధ్యలో నందిగామ మండల పరిధిలోని సంఘీగూడ గ్రామానికి చెందిన టిప్పర్ యజమానితో పాటు అతడి స్నేహితుడు చంద్రయ్య, సురేష్ వేములనర్వ గ్రామ శివారులో టిప్పర్లను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి టిప్పర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టిప్పర్ డ్రైవర్లు శ్యామ్‌కుమార్ సాహు, అమరేందర్ కుమార్, అజయ్‌కుమార్ యాదవ్‌తో పాటు విధులకు ఆటంకం కలిగించిన చంద్రయ్య, సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు.


