మోమిన్‌పేట: హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతూ ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న, గాయాలపాలవుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా మంది హెల్మెట్ వినియోగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మండల పరిధిలోని అంరాధికలాన్‌కు చెందిన చాకలి భీమయ్య ఎక్కడికై నా సైకిల్‌పై వెళ్తూ విధిగా హెల్మెట్ ధరిస్తున్నారు. సైకిల్‌కు హెల్మెట్ తప్పనిసరి కాదు కదా అని అడగగా.. నా సైకిల్‌పై నేను నిదానంగా వెళ్తున్నా.. ఎదుటివారు అడ్డదిడ్డంగా వచ్చి ఢీకొడితే హెల్మెట్ కాపాడుతుందని బదులిచ్చారు. ద్విచక్ర వాహనదారులు ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ప్రమాదాల్లో ప్రాణనష్ట తీవ్రతను తగ్గించవచ్చు.


