బెంగళూరులో చోరీ... కుల్కచర్లలో రికవరీ | - | Sakshi
Sakshi News home page

బెంగళూరులో చోరీ... కుల్కచర్లలో రికవరీ

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

కుల్కచర్ల: బెంగళూరులో జరిగిన చోరీ సొత్తును మండల కేంద్రమైన కుల్కచర్లలో రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్లలో బుడ్డరాం, సురేష్‌, కై లాస్‌ నగల దుకాణం నిర్వహిస్తున్నారు. సురేష్‌, కై లాస్‌ రాజస్థాన్‌కు చెందిన మరో ముగ్గురు బెంగళూరు కమిషనరేట్‌ పరిధిలోని బెలున్‌ఘట్‌ ప్రాంతంలో ఏప్రిల్‌ 27న ఓ నగల దుకాణంలో 70కిలోల వెండిని చోరీ చేశారు. అక్కడి పోలీసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారు కుల్కచర్లకు చెందిన సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. చోరీ చేసిన వెండిని కుల్కచర్లలోని కేసరియా జ్యువెలర్స్‌, బుడ్డరాం ఇంటిలో స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో 4 కిలోల 600 గ్రాములు, దుకాణంలో మరో 6కిలోలు లభ్యమైంది.

Advertisement
 
Advertisement
Advertisement