వనం మరిచిన కోతులు | - | Sakshi
Sakshi News home page

వనం మరిచిన కోతులు

May 12 2026 6:12 AM | Updated on May 12 2026 6:12 AM

పంటలు నష్టపోతున్న రైతులు బెదడ తీరుస్తామని హామీలిచ్చిన నేతలు మూడేళ్ల క్రితమే సర్వే పూర్తి నేటికీ చర్యలు శూన్యం 50 కోతులు పట్టించి‘కొండ’ంత ప్రచారం

వికారాబాద్‌: కోతుల బెడద తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సర్వేకే పరిమితమయ్యాయి. ఇదే విషయమై రైతులు గతంలో పలుసార్లు అప్పటి మంత్రులు సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రస్తుత స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు పలుమార్లు వినతులిచ్చారు. దశాబ్ద కాలంగా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతులు చేస్తూ రాగా ఎట్టకేలకు ప్రభుత్వం 2022లో జిల్లాలో వ్వవసాయ శాఖ ఆధ్వర్యంలో వానర గణన చేపట్టింది. కాగా కోతుల ను వనంలో వదిలేయడం కానీ, ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ) శస్త్ర చికిత్సలు చేస్తామని ప్రకటనలు గుప్పించినా ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఇటీవల వీటి బెడద తీవ్రమైంది.

సర్వేకే పరిమితం

కోతులను లెక్కించే బాధ్యతలు క్షేత్రస్థాయిలో ఏఈఓలకు అప్పగించారు. ప్రధానంగా మండలాలు, గ్రామాల్లో ఎన్ని కోతుల గుంపులు ఉన్నాయి. ఆయా గుంపుల్లో ఎన్ని కోతులు ఉన్నాయనే ప్రాతిపదికన కోతులను లెక్కించారు. లెక్కించిన వివరాలు నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. జిల్లాలో ధారూరు మండలంలో అత్యధికంగా కోతులు ఉండగా పరిగి, కోట్‌పల్లి, దోమ, పెద్దేముల్‌, కుల్కచర్ల, వికారాబాద్‌, మండలాల్లోనూ సంచారం అఽధికంగానే ఉంది. మూడేళ్ల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం ఒక్క ధారూరు మండంలోనే 194 వానరాల గుంపులు గుర్తించగా ఇందులో 25,983 కోతులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దోమ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కలిపి 2,986 వానరాలున్నాయి. మోమిన్‌కలాన్‌, ధారూరు, నాగారం, మున్నూర్‌సోమారం, కెరవెళ్లి, గుర్దొట్ల, నాగసముందర్‌, లఖ్నాపూర్‌, పాలపల్లి, అనంతగిరి తదితర గ్రామాల్లో కోతుల గుంపులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ గ్రామాల్లో ఒక్కో గ్రామంలో రెండు నుంచి నుండి ఐదు వేల వరకు కోతులున్నాయి. అప్పటి సర్వే ప్రకారం 45,000– 50 వేల కోతులు ఉన్నాయని లెక్కలు తేల్చగా ఆ సంఖ్య ఇప్పుడు 70 వేలు దాటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

రైతులకు అధిక నష్టం

కోతుల కారణంగా రైతులు అత్యధికంగా నష్ట పోతున్నారు. వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, పళ్లతోటలు, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వరి పంటను సైతం పీకి పడేస్తున్నాయి. జనం సంచులు తీసుకువెళ్తున్నా దాడి చేసి గాయపరిచి లాక్కుంటున్నాయి. ధారూరులో బిల్డింగ్‌ పైన ఉన్న ఓ మహిళను కోతులు వెంబడించగా ఆమె భవనం పై నుంచి దూకడంతో తీవ్రగాయాలై ఆస్పత్రి పాలైంది. జిల్లాలో ఎక్కువ శాతం నాపరాతి బండలతో కప్పిన పైకప్పుడు ఉండగా ఆ బండలను పీకి మరీ ఇళ్లలోకి చొరబడుతున్నాయి. వీటిని లెక్కించాక వాటిని సుదూర అటవీ ప్రాంతాలకు తీసుకువెళ్లి వదలటం కానీ, సంతతిని నియంత్రించడంగానీ చేస్తారని జనం ఆశగా చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 50 కోతులను పట్టి తీసుకెళ్లగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ ప్రక్రియ అక్కడికే నిలిచిపోయింది.

వణికి పోతున్న గ్రామాలు

Advertisement
 
Advertisement
Advertisement