గెలుపోటములను సమానంగా స్వీకరించాలి | - | Sakshi
Sakshi News home page

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

May 12 2026 6:12 AM | Updated on May 12 2026 6:12 AM

● శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

ధారూరు: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సూచించారు. ఇటీవల ధారూరులో చేపట్టిన క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగియడంతో సోమవారం ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతిస్తోందని.. యువత చదవుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. విజేత జట్టు ధారూరుకు రూ.20వేల నగదు, రన్న రప్‌ జట్టు గట్టెపల్లికి రూ.పదివేల నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేశారు. అంతకు మందు ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్‌, డీసీసీ కార్యదర్శి మహ్మద్‌ బాబాఖాన్‌, సర్పంచ్‌ ప్రమీళగౌడ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, నాయకులు కల్వ కిరణ్‌కుమార్‌, బుజ్జయ్యగౌడ్‌, తిరుపతిగారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement