తాండూరు: మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రభు త్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్నఓ భవనాన్ని మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశా రు. తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదు ట ఉన్న ప్రధాన రహదరి పక్కన 130 సర్వే నంబర్‌లో 36 గుంటల ప్రభుత్వ భూమిని పట్టణానికి చెందిన వ్యాపారి కబ్జా చేసి నిర్మాణ పనులు చేపట్టాడు. ఈ విషయమై గత నెల 16న 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మధుసూదర్‌రెడ్డి తాండూరు తహసీల్దార్‌తో మాట్లాడి వివరాలను సేకరించారు. రెవెన్యూ రికార్డుల్లో సర్వేనెంబర్ 130 ప్రభుత్వ భూమిగా 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సోమ వారం టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా నిర్మి స్తున్న కట్టడాలను కూల్చి వేసేందుకు జేసీబీని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కబ్జా దారులు అక్కడకు చేరుకుని అడ్డుకునేందుకు యత్నించగా వాగ్వా దం జరిగింది. అధికారులు పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో పోలీసుల సమక్షంలో కబ్జాలను కూ ల్చి వేశారు. ప్రభుత్వ భూములను అక్రమించి కబ్జా కు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కౌన్సిలర్ అధికారులను కోరారు.


