పెండింగ్‌ వేతనాలు చెల్లించండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ వేతనాలు చెల్లించండి

May 12 2026 6:12 AM | Updated on May 12 2026 6:12 AM

సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌

అనంతగిరి: జిల్లా వ్యాప్తంగా గిరిజన, ఆశ్రమ హాస్టళ్లలో పనిచేస్తున్న సిబ్బంది పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన వారితో కలిసి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది నెలలుగా వేతనాలు అందక హాస్టల్‌ వర్కర్స్‌ ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రయ్య, రాములు, శ్రీనివాస్‌, తారాబాయి, లక్ష్మి, మొగులమ్మ, అంజమ్మ, భీమమ్మ, మొగులమ్మ, రాములు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement