ఏర్పాట్లు పూర్తి చేశాం
తాటి ప్రయోజనాల్లో మేటి తాటి ముంజలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అధిక పోషకాలు ఉండటంతో ధర ఎక్కువైనా కొంటున్నారు.
● జూన్ 9 వరకు ప్రక్రియ
● వివరాలు సేకరించనున్న ఎన్యుమరేటర్లు
● ముగిసిన స్వీయ గణన
వికారాబాద్: జనాభా లెక్కల సేకరణ మొదటి దశలో భాగంగా నేటి(సోమవారం) నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పది రోజులపాట స్వీయ గణనకు అవకాశం ఇవ్వగా ఈ నెల 10వ తేదీతో గడువు ముగిసింది. మూడు రోజులపాటు ఎన్యుమరేటర్లు గ్రామాలు, వార్డుల వారీగా కేటాయించిన ఇళ్లకు మ్యాపింగ్ చేయనున్నారు. అనంతరం సర్వే ప్రక్రియను ప్రారంభిస్తారు. ముందుగా స్వీయ గణనలో నమోదు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి వాటిని అప్రూవల్ చేస్తారు.
అంతా సిద్ధం
జిల్లాలో ఇళ్ల గణనకు సర్వం సిద్ధమైంది. అవసరమైన సిబ్బంది, ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేశారు. రెండు వేడతల్లో సర్వే నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఇళ్లు, కుటుంబాలను మాత్రమే లెక్కిస్తారు. నెల రోజుల పాటు ఈ ప్రక్రియ సాగనుంది. ఇందులో ఎలాంటి నివాసాలు ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఎన్ని అంతస్తులు కలిగి ఉన్నాయి అనే వివరాలు నమోదు చేస్తారు. రెండో విడత సర్వే 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అప్పుడు జనాభా లెక్క తేల్చనున్నారు.
ఈసారి పూర్తిగా డిజిటలైజేషన్
ఇప్పటివరకు జనాభా లెక్కలు కాగితాల్లో నిర్వహించి ఫైళ్ల రూపంలో భద్రపరుస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్యాబ్, సెల్ ఫోన్ల ద్వారా సర్వే చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే మండల ఇన్‌చార్జ్ అధికారిగా ఎంఈఓలు, తహసీల్దార్లను.. మున్సిపాలిటీల్లో కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. సూపర్ వైజర్లుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను తీసుకున్నారు. ఎన్యుమరేటర్లుగా జూనియర్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు వ్యవహరించనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 300 కుటుంబాలతో కూడిన బ్లాక్‌ను అప్పగించనున్నారు. మొదటి విడత సెన్సెస్‌లో 34 కాలమ్స్‌తో కూడిన డిజిటల్ ఫారాల ద్వారా సర్వే చేస్తారు.
పెరగనున్న జనాభా
ప్రస్తుతం 2011 సెన్సెస్‌కు సంబంధించిన జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న జనగణనతో జిల్లా జనాభా రెండు లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. 2001 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 8,28,664 కాగా 2011 నాటికి 9,27,140కి చేరుకుంది. ప్రస్తుత ఓటరు జాబితా ఆధారంగా చూస్తే జిల్లా జనాభా రెండు లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన 11,25,000 మంది ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఇళ్ల గణనకు ఏర్పాట్లు పూర్తి చేశాం. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు సేకరించాలని ఆదేశించాం. ప్రజలు ధైర్యంగా వివరాలు చెప్పొచ్చు. వాటిని గోప్యంగా ఉంచుతాం. ఎన్యుమరేటర్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– దీపక్ తివారి, కలెక్టర్


